ఆంధ్ర ప్రదేశ్
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. కొమరాడ మండలం గంగరాయవలస గ్రామంలో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలను ఏనుగుల గుంపు నాశనం చేశాయి. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం మొత్తం వృధా కావడంతో రైతు లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
మరోవైపు గ్రామంలో ఏనుగుల గుంపు తిరుగుతుండడంతో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళ పొలాలు, గ్రామాల వైపు ఏనుగులు వస్తుండటంతో పంటలతో పాటు నిల్వ ఉంచిన ధాన్యానికి భద్రత లేకుండా పోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



