ఆంధ్ర ప్రదేశ్
దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు దావోస్‌లో పర్యటిస్తున్నారు. కాసేపట్లో జ్యురిచ్ ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు చేరుకోనున్నారు. చంద్రబాబు వెంట లోకేష్, టీజీ భరత్, అధికారులు ఉన్నారు. మధ్యహ్నం రెండున్నరకు భారత రాయబారి మృదుల కుమార్‌తో భేటీ కానున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొననున్నారు. రేపు దావోస్ ఆర్థిక సదస్సులో చంద్రబాబు పాల్గొననున్నారు.



