ఆంధ్ర ప్రదేశ్

Vallabhaneni Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరో బిగ్ షాక్

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరోషాక్‌ తగిలింది. ఇప్పటికే సత్యవర్ధన్‌ కిడ్నాప్‌, బెదిరింపుల కేసులో ఈ నెల 28 వరకు రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ అయితే, ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కబ్జా కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించింది గన్నవరం కోర్టు కబ్జా కేసులో వల్లభనేని వంశీ మోహన్‌పై నమోదైన కేసులో కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతి ఇవ్వటంతో గన్నవరం కోర్టులో వంశీని హాజరుపరిచారు పోలీసులు.

విజయవాడ సబ్‌జైలులో వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకుని గన్నవరం తరలించిన ఆత్మకూరు పోలీసులు గన్నవరం కోర్టులో వల్లభనేని వంశీ మోహన్‌ను హాజరుపరిచారు. అయితే, ఆత్మకూరు పీఎస్‌లో నమోదైన భూ కబ్జా కేసులో వల్లభనేని వంశీకి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది గన్నవరం కోర్టు అనంతరం తిరిగి విజయవాడ సబ్ జైలుకు వంశీని తరలించారు పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button