ఆంధ్ర ప్రదేశ్
ఏసీబీ కస్టడీకి ఐపీఎస్ అధికారి సంజయ్

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ను అధికారులు విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మూడు రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు సంజయ్‌ను అధికారులు విచారిస్తున్నారు. అగ్నిమాపక శాఖ పరికరాల కొనుగోలు వ్యవహారంలో సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విజయవాడ జిల్లా జైలులో సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.



