ఆంధ్ర ప్రదేశ్

Pawan Kalyan: వైసీపీ రుషికొండలో నిర్మాణాలతో ప్రజా ధనాన్ని వృథా చేసింది

Pawan Kalyan: వైసీపీ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రుషికొండలో నిర్మాణాలతో ప్రజా ధనాన్ని వృథా చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రుషికొండపై వైసీపీ హయాంలో 7 బ్లాక్ లకి 4 మాత్రమే కట్టారని, 454 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. గతంలో అవి నిర్మిస్తున్న సమయంలో వైసీపీ నేతలు మమ్మల్ని అందులోకి రానివ్వలేదు ఎన్నో అడ్డంకులు సృష్టించారని గుర్తుచేసుకున్నారు. నిర్మాణాలలో రెండు బ్లాక్ లకి మాత్రమే 90 కోట్లు ఖర్చు చేశారు. ఒకదానికి 70 కోట్లు ఖర్చు చేశారు.

మరో బ్లాక్ రూ.20 కోట్లతో కట్టారు. కానీ ఏడు బ్లాకులు కట్టాల్సి ఉండగా నాలుగు మాత్రమే పూర్తి చేశారు. కానీ 4 బ్లాకులకే ఏకంగా రూ.454 కోట్లు ఖర్చుచేయడంపై పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జనసేన విస్తృతస్థాయి సమావేశాలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రుషికొండ మీద నిర్మాణాలను పరిశీలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button