సినిమా
Gaddar Awards: జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం

Gaddar Awards: జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ చెప్పారు. హెచ్ఐసీసీ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇవాళ హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డ్స్ కర్టెన్ రైజ్ కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు, గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ ఛైర్మన్ జయసుధ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.