ఆంధ్ర ప్రదేశ్

Homestay Gang War: తిరుపతిలో సంచలనంగా మారిన హోం స్టేల గ్యాంగ్ వార్

Homestay Gang War: తిరుపతిలో హోం స్టే లే గ్యాంగ్ వార్ సంచలనంగా మారింది. ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని చింతలచేనులో రెండు హోం స్టేల మధ్య ఘర్షణ తలెత్తింది. డెక్కన్ సూట్స్ హోమ్ స్టే నిర్వాహకులపై కర్రలు, రాడ్లతో దాడి చేసారు గరుడ హోం స్టే యాజమాన్యం. డెక్కన్ సూట్స్ హోం స్టే నిర్వాహకులు నరేష్, నవీన్, లక్ష్మీనారాయణ, ఫణిందర్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి.

గాయపడిన వారిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. ఒక హోం స్టే కు వచ్చే కస్టమర్లను మరొక హోం స్టే వాళ్లు లాక్కెళుతున్నారని ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. దీంతో దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన ఏడుగురిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనతో శ్రీవారి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button