తెలంగాణ
Mahesh Kumar Goud: బీజేపీ నేతలకు కులం, మతం లేకుండా పూట గడవదు

Mahesh Kumar Goud: హిల్ట్ పాలసీ పై విమర్శలు చేయడం దారుణమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీ మొత్తం కాలుష్యం అయ్యిందని అలాంటి పరిస్థితి తెలంగాణలో రాకూడదనే ఈ పాలసీని తీసుకొచ్చమన్నారు. బీఆర్ఎస్ నేతలు పదేండ్లు తెలంగాణను అమ్మేసుకున్నారని హైదరాబాద్‌ను అడ్డగోలుగా దోచుకుంటే బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. బీజేపీ నేతలకు కులం, మతం లేకుండా పూట గడవదని వారు అభివృద్ధిపై ఎందుకు మాట్లాడుతారని విమర్శించారు.



