ఆంధ్ర ప్రదేశ్
మోదీ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న ఐశ్వర్యరాయ్

పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శతజయంతి వేడుకల్లో ఒక విశేషం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ స్టేజ్‌పై కూర్చున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బహిరంగ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్ ప్రసంగించి, భగవాన్ సత్యసాయి బాబా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మనసుల్లో సత్యసాయిబాబా ఎప్పటికీ నిలిచిపోతారని ఆమె అన్నారు.



