తెలంగాణ
KTR: గడ్డాలు పెంచిన ప్రతీ ఒక్కడు గబ్బర్ సింగ్ కాలేడు

KTR: కేసీఆర్, రేవంత్ కరచాలనంపై కేటీఆర్ చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. సభలోనే కాదు బయటకూడా సంస్కారం ఉండేలా మాట్లాడాలని కేటీఆర్ అన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిపై గౌరవం ఉండాలని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకుల వాతావరణము ఉంటే మంచిదే అని కేటీఆర్ అన్నారు.
మీసాలు, గడ్డాలు పెంచడంపైన కెటిఅర్ చిట్‌చాట్‌లో కామెంట్స్ చేశారు. గడ్డం పెంచిన ప్రతి ఒక్కడు గబ్బర్ సింగ్ కాలేడు అన్నారు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీకి గడ్డం మీసాలు ఉండవు మరి వారినేమంటారు రేవంత్ రెడ్ది అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అల్లుడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తే అని కేటీఆర్ అన్నారు.



