జాతియం
Delhi: ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

Delhi: ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా వీహెచ్పీ ఆందోళనకు దిగింది. కార్యాలయంలోకి వెళ్లేందుకు వీహెచ్పీ, హిందూ సంఘాలు ప్రయత్నించాయి.
వీహెచ్పీ, హిందూ సంఘాల నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో హిందూ సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను తోసుకుంటూ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులను పోలీసులు లాఠీలతో చెదరగొడుతున్నారు.



