తెలంగాణ
Telangana: మినీ అంగన్వాడి టీచర్లకు శుభవార్త

Telangana: మినీ అంగన్వాడీ టీచర్లకు శుభవార్త అందింది. 3 వేల 9 వందల 89 మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ప్రభుత్వం ప్రమోట్ చేసింది. ఇక నుంచి అంగన్వాడీ టీచర్ల లాగా వేతనం అందుకోనున్నారు మినీ అంగన్వాడీ టీచర్లు.
మినీ, మెయిన్ అంగన్వాడీ అనే తేడా లేకుండా ఇకపై అందరూ అంగన్వాడీ టీచర్లలాగే పిలవబడనున్నారు. ఈ నెల నుంచి ఈ నెల నుంచే మార్పు అమల్లోకి రానుంది. గతంలో మినీ అంగన్వాడీ టీచర్లకు నెలకు జీతం 7 వేల 800 ఉండగా ఏప్రిల్ నుంచి 13 వేల 650 రూపాయల జీతం అందుకోనున్నారు.