Samantha: సమంత రెండో పెళ్లి.. నిజమేనా?

Samantha: సమంత రూత్ ప్రభు మరోసారి వార్తల్లో సందడి చేస్తోంది. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సామ్ చేస్తున్న సంచలనాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రెండో పెళ్లి రూమర్స్‌తో పాటు, ఆమె నిర్మాతగా మెరిసిన ‘శుభం’ సినిమా కూడా హాట్ టాపిక్‌గా మారింది.
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఒంటరి జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో మే నెలలో పెళ్లి పీటలు ఎక్కబోతుందని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. ఇరు కుటుంబాలు ఈ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అయితే, సమంత, రాజ్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు. మరోవైపు, సమంత నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ సినిమా చర్చనీయాంశమైంది. కొత్త నటీనటుల అద్భుత నటనను సామ్ ప్రశంసించింది. తన కెరీర్ ఆరంభంలో నటన గురించి తెలియని తాను, ఈ తరం నటుల ప్రతిభకు ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది. సమంత వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం రెండూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. ఈ రూమర్స్ నిజమవుతాయా? వేచి చూడాలి.