అంతర్జాతీయం
Helicopter Crash: నదిలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

Helicopter Crash: న్యూయార్క్లో హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి చెందారు. హడ్సన్ నదిలో ఇది కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో బోట్ల సాయింతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ తలకిందులుగా పూర్తిగా నీళ్లలో కూరుకుపోయిందని వెల్లడించారు. గాల్లో ఉండగానే హెలికాప్టర్లోని ఒక భాగం విరిగిపోయిందని అధికారులు పేర్కొన్నారు.