తెలంగాణ
Hyderabad: ఇంటిపక్కన వారితో వివాదం.. గుండెపోటుతో మహిళ మృతి

Hyderabad: హైదరాబాద్ సాయినాథ్ గంజ్ పీఎస్ పరిధిలో విషాదం నెలకొంది. భవన నిర్మాణ వివాదం సమయంలో ఓ మహిళ గుండెపోటుకు గురై మృతి చెందింది. కాగా తన ఇంటి నిర్మాణ పనుల్లో అడ్డు వస్తున్నారని పక్క ఇంటి వారిపై సమీప పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే ఇప్పటి వరకు పోలీసులు ఫిర్యాదుపై స్పందించలేదని మహిళ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇంటి పక్క ఉన్న వ్యక్తులపై పోలీసులు చర్యలు తీసుకునేంతవరకు శవాన్ని కదిలించేంది లేదని ఆందోళనకు దిగారు.