సినిమా

Pawan Kalyan: నా జీవితానికి అన్నయ్యే హీరో.. చిరుపై పవన్ ఎమోషనల్ ట్వీట్!

Pawan Kalyan: చిరంజీవి యూకే ప్రభుత్వం నుంచి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ అందుకోవడంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.యూభై ఏళ్ళుగా ఆయన సినీ రంగానికి అందించిన సేవలకు గాను ఈ అవార్డు వరించింది. యూకే పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మాన్ తదితరులు సమక్షంలో చిరంజీవికి అవార్డు ప్రధానం జరిగింది. స్టాక్ పోర్ట్ ఎంపీ శ్రీనవేందు మిశ్రా ఆధ్వర్యంలో అవార్డు వేడుకను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవికి శుభకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా ఎమోషనల్ అయ్యారు. అన్నయ్య కోసం సుదీర్ఘ పోస్టును షేర్ చేశారు. అలాగే ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన స్టాక్ పోర్ట్ ఎంపీ శ్రీ నవేందు మిశ్రాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చిరు పై పవన్ కి ఎంత ప్రేమ ఉందో ఈ ట్వీట్ మరోసారి నిరూపించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button