తెలంగాణ
Raja Singh: ఏ భాషలో పెట్టాలన్నది ప్రభుత్వ ఇష్టం.. ఒవైసీ ఇష్టం కాదు..

Raja Singh: ఎంఐఎం నేతల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఎంఐఎం గుండారాజ్యం పెరిగిపోతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఫ్లైఓవర్ సైన్ బోర్డు ఉర్దులో రాయలేదని.. ఆర్ అండ్ బీ అధికారులను బెదిరిస్తారా అంటూ నిలదీశారు. పెట్టిన బోర్డును ఎలా తీపిస్తారు..? ఎవరిచ్చారు మీకు అధికారం అంటూ క్వశ్చన్ చేశారు.
ఫ్లైఓవర్ ప్రజల డబ్బుతో కట్టారు.. ఎవరి అయ్యా జాగిరి కాదనంటూ ఎంఐఎం తీరుపై రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఇక సైన్ బోర్డు ఏ భాషలో పెట్టాలన్నది ప్రభుత్వ ఇష్టమన్న రాజాసింగ్.. అది ఓవైసీ ఇష్టం కాదన్నారు. ఇకపై ఇలాంటి చర్యలను మానుకుంటే మంచిదన్నారు.



