సినిమా
Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి

Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో ఆయన ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నాడు.
ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్ కుటుంబం నిద్రలో ఉండగా ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు చోరీకి యత్నించాడు. అలికిడికి మెలకువ వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసిన సైఫ్‌పై దుండగుడు దాడిచేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సైఫ్ ఇంటికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ముంబై క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారైన దొంగ కోసం గాలిస్తున్నారు.