ఆంధ్ర ప్రదేశ్
తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్ నిర్వహణ బాధ్యతలు కేఎస్‌టీడీసీకి

తిరుమలలోని కర్ణాటక ప్రవాసి సౌధ నిర్వహణ బాధ్యతలు త్వరలో కర్ణాటక రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కేఎస్టీడీసీ చేపట్టనుంది. ఈ మేరకు కర్ణాటక కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రవాసి సౌధను 3 నుంచి 4 స్టార్ హోటల్ స్థాయి ప్రమాణాలతో నిర్వహించనున్నట్లు సంస్థ ఎండీ వెల్లడించారు.
ఇప్పటికే సంబంధిత అధికారుల మధ్య ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలో దశలవారీగా సిబ్బందిని నియమించి భవనాన్ని అధికారికంగా స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. అయితే, దశాబ్దాలుగా ఎండోమెంట్స్ శాఖ పరిధిలో ఉన్న గెస్ట్ హౌస్‌ను పర్యాటక సంస్థకు అప్పగించడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.



