అంతర్జాతీయం
జీ7 దేశాలు కీలక నిర్ణయం.. 4 నెలల్లో 10 కోట్ల బ్యారెళ్ల చమురు విడుదల

జీ7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయంగా చమురు సరఫరా, ఇంధన ధరలపై ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో.. భారీగా చమురు నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు అంగీకరించాయి. రాబోయే నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా 10 కోట్ల బ్యారెళ్ల చమురు, ఇంధన ఉత్పత్తులను విడుదల చేయాలని జీ7 దేశాలు నిర్ణయించినట్లు సమాచారం.
ప్రపంచ చమురు మార్కెట్‌లో సరఫరాను పెంచడం.. ధరలపై ఒత్తిడిని తగ్గించడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. జీ7 దేశాల వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి దశలవారీగా ఇంధనాన్ని మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. ఇప్పటికే చమురు ధరల కదలికలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. జీ7 నిర్ణయం మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.



