ఆంధ్ర ప్రదేశ్
వైసీపీకి మాజీ ఏఎంసీ చైర్మన్ ముత్యాల రాజబ్బాయి రాజీనామా

కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీకి మాజీ ఏఎంసీ చైర్మన్ ముత్యాల రాజబ్బాయి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలో నిర్వహించిన సమావేశంలో రాజబ్బాయి తన రాజకీయ ప్రస్థానాన్ని వివరించారు. 1983లో ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నానని, అప్పటి నుంచి పలువురు ఎమ్మెల్యేలతో కలిసి పనిచేశానని తెలిపారు.



