జాతియం

డాలర్‌తో పోలిస్తే భారీగా బలపడిన రూపాయి

డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి భారీగా బలపడింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే రూపాయి ఏకంగా 47 పైసలు లాభపడి 94.26 వద్దకు చేరింది. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి 94.97గా ఉన్న రూపాయి.. ఇవాళ గణనీయంగా పుంజుకుంది. ఆర్‌బీఐ ప్రత్యేక పథకాల ద్వారా భారీగా విదేశీ నిధులు భారత్‌లోకి రావడం రూపాయి బలోపేతానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

విదేశీ కరెన్సీ సమీకరణ పథకాల ద్వారా ఏకంగా 136.38 బిలియన్ డాలర్ల నిధులు రావడం మార్కెట్‌కు ఊతమిచ్చింది. మరోవైపు ఆసియా కరెన్సీల పుంజుకోవడం, డాలర్ ఇండెక్స్ 99.50 దిగువకు పడిపోవడం కూడా రూపాయికి కలిసొచ్చాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button