క్రీడలు
టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం

టీ 20 వరల్డ్ కప్‌లో టీమిండియా వరుసగా మూడో విజయం సాధించింది. 61 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను మట్టి కరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన పాకిస్తాన్ 114 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ విజయంలో భారత్ సూపర్ 8కి దూసుకెళ్లింది.



