వ్యాపారం

Gold Price Hike: ఆల్‌టైమ్‌ హైకి బంగారం ధర

Gold Price Hike: బంగారం ఇప్పటికే సామాన్యులకు కలగా మారితే ఇప్పుడు వెండి కూడా అదే బాటలో నడుస్తోంది. ఇటీవలి రోజుల్లో వెండి ధరలు ఊహించని స్థాయిలో పెరిగి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గత నాలుగు రోజుల్లోనే కిలో వెండి ధర ఏకంగా రూ.24 వేల వరకు పెరిగింది. ఇందులో ఒక్క రోజులోనే 12 వేల పెరుగుదల నమోదైంది. దీంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర 3, లక్షల 30 వేలకు చేరింది.

ఇంతవరకు వెండిని తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉండగా, ఇప్పుడు అది కూడా అందని స్థాయికి చేరింది. ఇక బంగారం ధరలు కూడా అదే దిశగా పరుగులు తీస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర లక్ష 50వేల 680కు చేరింది.

తెలుగు రాష్ట్రాల్లోనూ ధరలు దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి. వచ్చే నెల నుంచి శుక్ర మౌఢ్యమి ముగిసి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో బంగారం, వెండి ఆభరణాలపై డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button