ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో ఏనుగుల కలకలం

తిరుమలలో మరోసారి గజరాజుల గుంపు హల్ చల్ చేయడంతో భక్తులను అటవీశాఖ, విజిలెన్స్ అధికారులు అప్రమత్తం చేశారు. ఇవాళ తెల్లవారుజామున పాపవినాశనం రోడ్డుకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఒక్కసారిగా ఘాట్ రోడ్డుపై దర్శనమిచ్చాయి.
ఈ మార్గంలో ఇనుప కంచెలను తొలగించి రోడ్లపైకి ఏనుగుల ఘీంకారాలు చేస్తూ స్వామివారి పార్వేటి ఉత్సవం నిర్వహించే పార్వేట మండపం వద్ద గుంపులుగా తిరిగాయి. కాసేపు పాపవినాశనం వెళ్ళే తీర్థాలకు భక్తులను అనుమతించని అధికారులు,ఏనుగుల గుంపు అటవీ బాట పట్టిన తర్వాత వాహనాల అనుమతిస్తున్నరు. ప్రస్తుతం ఈ గుంపును అడవుల్లోకి మళ్లించిన .. మళ్లీ ఇటుగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు



