తెలంగాణ
ఖానాపూర్లో గాలిపటాల సందడి

నిర్మల్ జిల్లా ఖానాపూర్లో గాలిపటాల సందడి నెలకొంది. మార్కెట్లో రంగురంగుల పతంగిలు, దారం, చరకాలకు భారీగా గిరాకీ పెరిగింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగురవేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తమకు నచ్చిన డిజైన్ల కోసం దుకాణాల వద్ద కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు.



