తెలంగాణ
బుద్వేల్లో అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ రీ సైక్లింగ్ పరిశ్రమలో మంటలు

రంగారెడ్డి జిల్లా బుద్వేల్లో అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ రీ సైక్లింగ్ పరిశ్రమలో మంటలు ఎగసిపడ్డాయి. మంటల దాటికి 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.



