తెలంగాణ
Hyderabad: వృద్ధురాలిపై స్ర్పేతో దాడి.. 10 తులాల బంగారం చోరీ

Hyderabad: హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది. కర్మాన్‌ఘాట్ పద్మా నగర్ కాలనీలో ఒంటరిగా నివసిస్తున్న సుగుణ అనే వృద్ధురాలిపై స్ప్రే చేసి సుమారు 10 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు దుండగులు. వృద్ధురాలికి పరిచయస్తురాలైన సుమిత్ర అనే మహిళ, మరో ఇద్దరు సుగుణ ఇంటికి వెళ్లారు.
ఈ క్రమంలోనే సుగణపై స్ప్రే చేయగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లారు దుండగులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



