తెలంగాణ
Seethakka: కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తే స్వయంగా వెళ్లి జాతరకు ఆహ్వానిస్తా

Seethakka: మేడారం సమ్మక్క సారక్క మహా జాతరకు అన్ని పార్టీల నేతలకు ఆహ్వానాలు అందిస్తున్నామని ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తే స్వయంగా వెళ్లి కేసీఆర్ను జాతరకు ఆహ్వానిస్తానని స్పష్టం చేశారు. ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డిని మేడారం జాతరకు ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు.



