తెలంగాణ
Telangana Assembly: ఎమ్మెల్యే కూనంనేని VS మంత్రి పొన్నం ప్రభాకర్

Telangana Assembly: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిలదీశారు. ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన వేదనలో ఉన్నారని ఆయన అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పటి వరకు పూర్తి చేశారని అన్నారు. కార్మిక సంఘాలను ఎప్పుడు పునరుద్ధరిస్తారని ప్రశ్నించారు.
కూనంనేని సాంబశివరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. విలీనం అంశం, యూనియన్ల ఏర్పాటు సీఎం దృష్టిలో ఉన్నాయన్నారు.ఆర్టీసీ కార్మికులకు కోటి బీమా కల్పిస్తున్నామన్నారు. ఔటర్ లోపల అన్ని ఆర్టీసీ బస్సులను ఈవీలుగా మారుస్తామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.



