తెలంగాణ

ఆదిలాబాద్ బంద్.. ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా

Adilabad Bandh: పార్టీ పిలుపుమేరకు ఆదిలాబాద్ జిల్లాలో బంధ్ కొనసాగుతోంది. సోయ రైతులకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ బంధ్ కు పిలుపునివ్వగా వ్యాపార వాణిజ్య సముదాయాలు బంద్ పాటిస్తున్నాయి. సోయా ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, రంగు మారినా సోయాను సైతం షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ప్రధాన డిమాండ్ తో ఈ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్ కొనసాగుతోంది. ఉదయమే ఆదిలాబాద్ బస్ డిపో ముందు బైఠాయించి బస్సులను నిలవరించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, పలువురు నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button