తెలంగాణ

మంత్రి ప్రెజెంటేషన్.. ఎమ్మెల్యేల గాఢనిద్ర

మినిస్టర్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుండగా కొద్ది మంది శాసనసభ్యులు సభలో నిద్రపోయారు. బీజేపీ శాసనసభ్యులు నిద్రపోతున్న విజువల్స్ లైవ్‌ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నిజామాబాద్ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్ గుప్తా, సిర్పూర్‌ ఖాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్‌ స్లీపింగ్‌మోడ్‌లోకి వెళ్లిపోయారు.

లంచ్‌ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మంత్రి ప్రసంగం చేస్తూ, పవర్ పాయింట్ స్లైడ్స్ ప్రెసెంట్స్ చేస్తుండగా ఎమ్మెల్యేలు నిద్రపోవడం వైరల్ అవుతోంది. రాష్ట్రం అంతా లైవ్‌లో సాగునీటి ప్రాజెక్టుల ప్రెజెంటేషన్ చూస్తుంటే ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా సభలో ఉండి నిద్రపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button