తెలంగాణ
పొగమంచుతో కమ్ముకున్న వేములవాడ పట్టణం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం పొగ మంచుతో కమ్ముకుపోయింది. పొగమంచు తీవ్రత అధికంగా ఉండడంతో రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేవస్థానానికి వచ్చే భక్తులకు ప్రధాన రహదారి కనబడకపోవడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో డ్రైవర్లు రహదారిని స్పష్టంగా చూడలేని పరిస్థితి నెలకొంది.



