తెలంగాణ
నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం చోరీలు

నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం చోరీలు కలకలం రేపుతున్నాయి. ఒకేరోజు రెండు ఏటీఎంల్లో చోరీకి యత్నించారు దుండగులు. యంత్రాలు తెరుచుకోకపోవడంతో ఏటీఎంకు నిప్పంటించారు దుండగులు. దీంతో ఏటీఎంలోని నగదు పూర్తిగా దగ్ధమైంది.
నగరంలోని 4వ, 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎంల్లో దుండగులు ఈ తరహా చోరీలకు యత్నించారు. దాదాపు 50 లక్షలకు పైగా నగదు అగ్నికి ఆహుతైంది. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



