తెలంగాణ
భూ సమస్య విషయంలో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి నిరసన

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. వల్లంపట్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కర్ల రవి తన వ్యవసాయ భూమిని గ్రామంలోని ఓ వ్యక్తికి భూమి అమ్మాడు. అయితే భూమి అమ్మకాలకు సంబంధించిన డబ్బుల చెల్లింపులో ఆలస్యం చేస్తుండడంతో రవి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రవికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా పోలీసుల మాట వినకుండా అక్కడే కూర్చున్నాడు బాధితుడు. తన భూ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాడు.



