ఆంధ్ర ప్రదేశ్
Bhadrachalam: భద్రాచలంలో నేటి నుంచి వైకుంఠ అధ్యయనోత్సవాలు

Bhadrachalam: వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు ఈ నెల 29 వరకు కొనసాగనున్నాయి.
అధ్యయనోత్సవాల సందర్భంగా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 29న గోదావరి తీరంలో తెప్పోత్సవం, 30వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.



