తెలంగాణ
KCR: ఈ నెల 19న తెలంగాణ భవన్కు కేసీఆర్

KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 19న తెలంగాణ భవన్కు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి జలాల అంశంతో పాటు, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన కీలక నీటిపారుదల ప్రాజెక్టులను కొనసాగించడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై విస్తృతంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దిశగా భవిష్యత్ కార్యాచరణపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.



