సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వెంకీ రాయల్ లుక్!

విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి స్పెషల్ సర్ప్రైజ్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న ఈ చిత్రంలో వెంకీ క్యామియోకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. స్టైలిష్ అవతారంలో కనిపిస్తున్న వెంకీ లుక్ అదిరిపోతోంది. పూర్తి వివరాలు చూద్దాం..
విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు టాలీవుడ్లో జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా మన శంకర వరప్రసాద్ గారు చిత్ర యూనిట్ నుంచి ప్రత్యేకమైన బహుమతి అందింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇవాళ మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో వెంకీ అద్భుతమైన రాయల్ అవతారంలో కనువిందు చేస్తున్నారు. హెలికాప్టర్ నేపథ్యంలో బాడీగార్డ్స్ చుట్టూ ఉన్న వెంకటేష్ హుందాతనంతో ఆకట్టుకుంటున్నారు.
ఈ లుక్ చూస్తేనే ఆయన పాత్ర ప్రాధాన్యం అర్థమవుతోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి గతంలో చెప్పినట్లు ఇది సాధారణ క్యామియో కాదు, సినిమా సెకండాఫ్లో ఎంట్రీ ఇచ్చి ఆఖరి 20 నిమిషాలు చిరూతో కలిసి సందడి చేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సన్నిహిత స్నేహితుడైన వెంకీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. షూటింగ్లో గడిపిన ప్రతి క్షణం జీవితాంతం గుర్తుండిపోతుందని, నీ ఉనికి ఎల్లప్పుడూ పాజిటివ్ వైబ్స్ నింపుతుందని హృదయపూర్వకంగా పోస్ట్ చేశారు. ఇద్దరు సీనియర్ హీరోలు మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.



