తెలంగాణ
అధికారుల నిర్లక్ష్యం.. వార్డు మెంబర్ అభ్యర్థి గుర్తు తారుమారు

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుర్తుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేశవాపురం ఏడవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజాతకు మొదట స్టూల్ గుర్తు కేటాయించారు ఆర్వో. దీంతో స్టూల్ గుర్తుతో సుజాత ప్రచారం నిర్వహించారు. అయితే బ్యాలెట్ పేపర్‌పై మాత్రం స్టూల్ గుర్తుకు బదులు గౌను గుర్తు కేటాయించారు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడుతున్నారు.



