తెలంగాణ
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాలు వెల్లడించనున్నారు.
మొదటి విడతలో 3 వేల 834 సర్పంచ్ స్థానాలు, 27 వేల 628 వార్డులకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్ పదవికి పోటీలో 12 వేల 960 మంది అభ్యర్థులు ఉండగా.. వార్డుల బరిలో 65 వేల 455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్‌లో వెబ్‌కాస్టింగ్ చేస్తున్నారు.



