తెలంగాణ గ్లోబల్ సమిట్.. డ్రోన్ షోకు గిన్నిస్ రికార్డు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముగింపు వేడుకల్లో భారీ డ్రోన్ షో నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో కలర్ఫుల్గా సాగిన డ్రోన్ షోకు గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. గతంలో అబుదాబిలో 2 వేల 131 డ్రోన్లతో రికార్డు ఉండగా తెలంగాణ రైజింగ్ డ్రోన్ షో ఆ రికార్డును బద్దలు కొట్టింది. గిన్నిస్ బుక్ ప్రతినిధుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి.. రికార్డు ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఈ షో అనంతరం బాణసంచా అలరించింది. బాణసంచా మెరుపులతో సదస్సు ప్రాంగణం కాంతులీనింది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముగింపు వేడుకల్లో భారీ డ్రోన్ షో నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో కలర్ఫుల్గా సాగిన డ్రోన్ షోకు గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. గతంలో అబుదాబిలో 2 వేల 131 డ్రోన్లతో రికార్డు ఉండగా తెలంగాణ రైజింగ్ డ్రోన్ షో ఆ రికార్డును బద్దలు కొట్టింది. గిన్నిస్ బుక్ ప్రతినిధుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి రికార్డు ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఈ షో అనంతరం బాణసంచా అలరించింది. బాణసంచా మెరుపులతో సదస్సు ప్రాంగణం కాంతులీనింది.
గతంలో అబుధాబిలో 2,131 డ్రోన్లతో సుదీర్ఘ వాక్యాన్ని ప్రదర్శించిన రికార్డు ఉండగా ఇప్పుడు తెలంగాణ రైజింగ్ షో దాన్ని బద్దలు కొట్టింది. గిన్నిస్ బుక్ ప్రతినిధుల నుంచి సీఎం రేవంత్రెడ్డి రికార్డు ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలను ప్రతిబింబించేలా చేసిన డ్రోన్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
ఈ షో అనంతరం బాణసంచా ప్రదర్శన అలరించింది. బాణసంచా మెరుపులతో సదస్సు ప్రాంగణం కాంతులీనింది. సదస్సు ప్రాంగణం సమీపంలోని బేగరికంచ, మీర్ఖాన్పేట గ్రామాల ప్రజలు కూడా అక్కడి నుంచే డ్రోన్ షో, బాణసంచా కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు.



