ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాళహస్తీశ్వరాలయంలో చొక్కాణి ఉత్సవం

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలోని మహానంది వద్ద చొక్కాణి ఉత్సవం వైభవంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చొక్కాణి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. బాలాదీపాలను మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య ఊరేగింపుగా తాటిచెట్టు వరకు తీసుకువచ్చి ప్రదక్షిణలు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చొక్కాణిని వెలిగించారు. చొక్కాణి జ్యోతి అఖండ ప్రజ్వలనతో ప్రకాశించింది. ఈ ఘట్టాన్ని తిలికించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.



