తెలంగాణ
Seethakka: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం

Seethakka: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో మంత్రి సీతక్క పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. మహిళా సంఘాలకు 50 కోట్ల చెక్కులను పంపిణీ సీతక్క పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని మంత్రి సీతక్క అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే మా లక్ష్యమన్నారు.
మహిళా సంఘాలకు 19 రకాల వ్యాపారాలు పెట్టించామని సీతక్క తెలిపారు. ఒక్క చీర ఇచ్చి వందల సార్ల చెప్పుకున్న ఘనత బీఆర్ఎస్‌ది అని విమర్శించారు. రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. గత ప్రభుత్వంలో గుట్టలకు, రోడ్లకు రైతు బంధు ఇచ్చారని సీతక్క ఆరోపించారు. దీంతో ప్రభుత్వంపై 24వేల కోట్ల భారం పడిందని మంత్రి సీతక్క తెలిపారు.



