తెలంగాణ
కాళోజీ హెల్త్ వర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం సీజ్

వరంగల్లోని కాళోజీ హెల్త్ వర్సిటీ పీజీ వైద్య విద్య మార్కుల రీవ్యాల్యూయేషన్ ప్రక్రియపై వచ్చిన ఆరోపణలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సంధ్య, విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు వర్సిటీ తనిఖీకి వెళ్లారు.
పరీక్షల నియంత్రణ విభాగంలోని జవాబు పత్రాలు భద్రపర్చిన గదితో పాటు జవాబు పత్రాలను స్కాన్ చేసిన కంప్యూటర్లను ఎమ్మార్వో సమక్షంలో సీజ్ చేశారు. అక్టోబర్ 7 నుండి నవంబర్ 1 వరకు జరిగిన మెడికల్ పీజీ ప్రాక్టికల్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వనున్నారు అధికారులు.



