తెలంగాణ
Yadadri: యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన పూజలు

Yadadri: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. అర్చక బృందం, వేదపండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పూలతో లక్షపుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించారు. పాంచ రాత్రాగమశాస్త్ర ప్రకారం సుమారు గంటకుపైగా లక్షపుష్పార్చన పూజ పర్వాలు కొనసాగాయి. విశేష వేడుకులను యాదాద్రి అర్చక బృందం నిర్వహించగా సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.



