ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: చిత్తూరు పర్యటనలో గాయపడ్డ మహిళకు గిఫ్ట్ పంపిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని ముసలిమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ఇటీవల పవన్ కళ్యాణ్ సందర్శించారు. పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో ముసలిమడుగు వద్ద పవన్ కళ్యాణ్ కారు కిందపడి ఓ మహిళకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో హేమలత కాలు ఫ్రాక్చర్ అయినట్లు డాక్టర్లు తెలిపారు.
విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆమె కోసం ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ పంపారు. హేమలతకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించిన పవన్ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇక గిఫ్ట్‌తో పాటు లేఖను జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ బాధితురాలికి అందజేశారు.



