ప్రభాస్ కెరీర్ బెస్ట్‌గా ఫౌజీ!

ప్రభాస్ లైనప్‌లో మరో భారీ చిత్రంగా ఫౌజీ రాబోతుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తర్వాత ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవల టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్‌తో ఫ్యాన్స్ ఆనందంలో మునిగారు. ఈ సినిమాప్రభాస్ కెరీర్ బెస్ట్‌గా నిలుస్తుందట.
ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనున్న ఫౌజీ సినిమా పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సీతారామం బ్లాక్‌బస్టర్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా సాగనుంది. ఇటీవల టైటిల్ రివీల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
ప్రభాస్ హాఫ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఆనందించగా, ఫుల్ లుక్ రిలీజ్ చేస్తే మరింత బాగుండేదని కామెంట్లు వెల్లువెత్తాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ చిత్రం అవుట్‌పుట్ పట్ల పూర్తి సంతోషంలో ఉన్నాడట. హను ప్రభాస్‌ను ఎప్పటికీ చూడని కొత్త లుక్‌లో చూపించబోతున్నాడు. కొన్ని సీన్లు అసాధారణంగా ఉంటాయట.
ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. పాటలు కూడా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా సిద్ధమవుతున్నాయి. మొత్తంగా ప్రభాస్ ఫౌజీకి ఫిదా అవుతున్నాడు. ఫ్యాన్స్ కూడా ఇది కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మైసూర్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తూ ఈ చిత్రంతోనే ఇంట్రడక్షన్ ఇస్తోంది. మేకర్స్ వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.



