Khushbu: గౌరీకి ఖుష్బూ మద్దతు!

Khushbu: మలయాళ నటి గౌరీ కిషన్‌కు ప్రెస్ మీట్‌లో బాడీ షేమింగ్ ప్రశ్న ఎదురైంది. అయితే ఆమె ధైర్యంగా కౌంటర్ ఇచ్చారు. ఆమెకు ఖుష్బూ సుందర్ గౌరీకి మద్దతుగా నిలిచారు.
మలయాళ నటి గౌరీ కిషన్ ఎదుర్కొన్న బాడీ షేమింగ్ సంఘటన సినీ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. కొత్త సినిమా ప్రమోషన్ సందర్భంగా ప్రెస్ మీట్‌లో ఓ రిపోర్టర్ ‘‘హీరోయిన్ బరువు ఎక్కువగా అనిపించిందా?’’ అని హీరో ఆదిత్య మాధవన్‌ను అడిగారు. ఆదిత్య సరదాగా సమాధానమిచ్చినా, మరుసటి ఈవెంట్‌లో మళ్లీ అదే ప్రశ్న ఎదురైంది. దీంతో గౌరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా బరువు తెలుసుకుని నువ్వు ఏం చేస్తావు? ఇది బాడీ షేమింగ్! నా నటన, పాత్ర గురించి మాట్లాడండి.
మగ నటుల్ని ఇలా అడుగుతారా? ఇది జర్నలిజానికి అవమానం’’ అని గట్టిగా స్పందించారు. ఈ సమాధానం నెట్టింట వైరల్ అయింది. తాజాగా నటి ఖుష్బూ సుందర్ గౌరీకి మద్దతుగా నిలిచారు. తన ఎక్స్ ఖాతాలో ఖుష్బూ రాసిన పోస్ట్‌లో ‘‘జర్నలిజం గౌరవం కాపాడాలి. మహిళా బరువు మీ వ్యవహారం కాదు. గౌరీ ధైర్యం అందరికీ ఆదర్శం’’ అని పేర్కొన్నారు. నెటిజన్లు, సెలబ్రిటీలు గౌరీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ వివాదం మరింత వేడెక్కింది.



