కథనార్ లుక్‌తో ఆకట్టుకున్న స్వీటీ!

అనుష్క శెట్టి లాంగ్ గ్యాప్ తర్వాత మలయాళంలో ఎంట్రీ ఇస్తోంది. ఫాంటసీ థ్రిల్లర్ కథనార్: ది వైల్డ్ సోర్సెరర్లో మెరుస్తోంది. ఆమె లేటెస్ట్ లుక్ రిలీజ్‌తో ఫ్యాన్స్ ఎక్సైట్ అయ్యారు.స్వీటీ మిస్టీరియస్ అట్మాస్ఫియర్లో అద్భుతంగా కనిపిస్తోంది.
అనుష్క శెట్టి చాలా కాలం తర్వాత పెద్ద తెరపై మెరవబోతోంది. ఈసారి తెలుగు కాదు, మలయాళం ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఫాంటసీ థ్రిల్లర్ కథనార్: ది వైల్డ్ సోర్సెరర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సృష్టించింది. రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తుండగా, జయసూర్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జయసూర్య లుక్ పోస్టర్ విడుదలైంది. పొడవాటి జుట్టు, దట్టమైన గడ్డంతో ప్రాచీన మాంత్రికుడి లుక్‌లో ఆకర్షించారు.
తాజాగా అనుష్క లుక్ రిలీజ్ అయింది. అందులో ఆమె అద్భుతంగా కనిపిస్తోంది. ఫ్యాన్స్ “ఇదే అనుష్క మ్యాజిక్!”, “క్వీన్ ఈజ్ బ్యాక్!” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.ఈ సినిమాని గోకులం గోపాలన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో 9వ శతాబ్దం నేపథ్యంలోని మాంత్రిక శక్తులు, ఆధ్యాత్మిక అంశాలు, సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ప్రధానంగా ఉంటాయట. వీఎఫ్ఎక్స్ పరంగా గ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.



