క్రీడలు
ICC Women World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు… తొలిసారి వరల్డ్ కప్ కైవసం

ICC Women World Cup 2025: భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో సౌతాఫ్రికాపై ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. 52 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన సౌతాఫ్రికా జట్టును 45.3 ఓవర్లలో 246 రన్స్‌కే కట్టడి చేసింది. దీప్తి శర్మ 5 వికెట్లు తీసి సత్తా చాటింది. ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల జట్టుకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో అద్భుత విజయం సాధించారని ప్రశంసించారు.



